Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఇండ్ల పైనుండి ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ వైర్లను తొలగించాలి...

ఇండ్ల పైనుండి ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ వైర్లను తొలగించాలి…

- Advertisement -

 సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

భువనగిరి మండలంలోని ముస్త్యాలపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీలోని పేదల ఇండ్ల పై నుండి వెళ్లిన విద్యుత్ లైన్లను వెంటనే తొలగించాలని, విద్యుత్ ప్రమాదం నుండి ప్రజల ప్రాణాలు కాపాడాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెక్కలే ఆస్తిగా ఎలాంటి ఆధారం లేని నిరుపేదలైన కుటుంబాలకు రాజకీయాలకతీతంగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి ఇవ్వాలని ప్రభుత్వాన్ని వారు కోరారు. బుధవారం భువనగిరి మండలం ముస్త్యాలపల్లి సీపీఐ(ఎం) గ్రామ శాఖ ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని వివిధ వార్డులలో పర్యటించి ప్రజా సమస్యలను అడిగి, తెలుసుకున్నారు. గ్రామంలోని ఎస్సీ కుటుంబాలు నివసించే వార్డులో విద్యుత్ పెద్ద లైను ఇండ్ల పై నుండి వెళ్లడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. పలుమార్లు అధికారులకు స్థానిక ప్రజా ప్రతినిధులకు మొరపెట్టుకున్న పట్టించుకునే నాధుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం పసునాది ఎల్లయ్యకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తే వారికి వేరే స్థలం లేక విద్యుత్తు వైర్ల కిందనే గతంలో ఉన్న గుడిసెను తొలగించి ఇల్లు నిర్మాణం చేస్తున్నారని, పలుమార్లు విద్యుత్ వైర్లను ముందు రోడ్డు భాగములనున్న లేదా వెనక భాగంలో వేయమని కోరితే అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదని అన్నారు. ఉన్నవాళ్లు తమకు అడ్డంగా ఉన్న విద్యుత్ వైర్లను తొలగించమంటే వెంటనే తొలగించే అధికారులు పేదలు నివసించే ఇండ్లపై ఉన్న విద్యుత్ వైర్లను ఎందుకు తొలగించడం లేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు. గ్రామంలో బిసి (వడ్డెర) కులానికి చెందిన ఐదు కుటుంబాలకు ఇల్లు లేక ఒక్కొక్క ఇంట్లో పిల్లా జెల్లలతో కాలం వెళ్ళదీస్తున్నారని మరి అలాంటి వాళ్లు ఇల్లు కోసం దరఖాస్తు చేసుకుంటే వారికి ఇవ్వకుండా ఆర్థిక స్తోమత ఉన్న వారికి ఇండ్లు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని నర్సింహ అధికారులను ప్రశ్నించారు.

ప్రభుత్వము తమ ఎన్నికల హామీలు ఇల్లు లేని పేదలందరికీ ఇండ్లు ఇస్తామని చెప్పి అర్హత ఉండి ఇల్లు లేకున్నా ఎందుకు ఇవ్వడం లేదని స్థానిక ఎమ్మెల్యేను ప్రశ్నించారు. ఇప్పటికైనా రాజకీయాలు మానుకొని అర్హత ఉన్న వారందరికీ తక్షణం ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వాలని సూచించారు. లేకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య, శాఖ కార్యదర్శి కళ్లెం లక్ష్మీనరసయ్య, సీపీఐ(ఎం) సభ్యులు, గ్రామ ప్రజలు పసునాది ఎల్లయ్య, రమేష్ నర్సింహ, సుర్పంగా రవి, పసునాది రాములు, నరేష్, బోదాసు మహేందర్, బోదాసు శేఖర్, నవీన్, యాదగిరి, లక్ష్మి లు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad