జిల్లా కలెక్టర్ హనుమంతరావు…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలో మూడు రోజులపాటు పారిశుద్ధ్యం పనులకు, సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం రోజు జూమ్ మీటింగ్ ద్వారా డివిజనల్ పంచాయతీ అధికారులు, ఎంపీవోలు పంచాయతీ సెక్రటరీలు, వైద్య సిబ్బంది సమన్వయం చేసుకుంటూ ప్రజల ఆరోగ్యాలతో ముడిపడి ఉన్న శానిటేషన్ నిర్వహణ లో నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రతి ఒక్కరూ పక్కాగా విధులు నిర్వహించాలన్నారు. మూడు రోజులపాటు అందుబాటులో ఉండి, గ్రామాలలో పారిశుద్ధ్యం పనులు,సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉండడానికి చర్యలు చేపట్టాలన్నారు.
గ్రామాలలో దోమలు వ్యాప్తి చెందకుండా ఉండడానికి ఇప్పటికే సిద్ధంగా ఉన్న ఆయిల్ బాల్స్ ను వాటర్ నిలిచి ఉన్నచోట వేయాలన్నారు. ట్యాంకులలో వాటర్ నిల్వ ఉన్నచోట ఆ నీటి మొత్తాన్ని పారవేయాలి అన్నారు. ఓ హెచ్ యస్ ఆర్ ట్యాంకులను నెలలో మూడు సార్లు క్లీన్ చేయాలన్నారు. ట్యాంకులను బ్లీచింగ్, క్లోరినేషన్ తో క్లీన్ చేసి కొత్త నీటిని నింపాలన్నారు. గ్రామాలలో దోమలు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రతి రోజు ఫాగింగ్ చేయించాలన్నారు. వైద్య సిబ్బంది మెడికల్ క్యాంపు నిర్వహించి గ్రామాల్లోడెంగ్యూ ,మలేరియా, ఇతర సీజనల్ వ్యాధులు , విష జ్వరాలు ప్రబలకుండా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పంచాయతీరాజ్ సిబ్బంది సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలన్నారు.ముందు జాగ్రత్తగా ప్రతి శుక్రవారం జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలలో గ్రామాలలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించాలన్నారు.
పంచాయతీ కార్యదర్శులు ఏఎన్ఎంలో సమన్వయంతో పంచాయతీ, మల్టీపర్పస్ సిబ్బందితో గ్రామంలో అవసరమైన పారిశుద్ధ్య పనులకు చర్యలు చేపట్టాలన్నారు. దోమల ద్వారా డెంగ్యూ ,చికెన్ గున్యా ,మలేరియా లాంటి వ్యాధులు వ్యాప్తి చెందకుండా అన్ని హ్యాబిటేషన్లలో ఫాగింగ్ చేపట్టాలన్నారు. గ్రామాలలో వర్షానికి పడిపోయిన విద్యుత్ స్తంభాలు, పోల్స్ గుర్తించి మరమ్మత్తులు చేయించాలని ట్రాన్స్కో అధికారులకు తెలిపారు. గ్రామాలలో పాఠశాలలో ,అంగన్ వాడి కేంద్రాలలో పారిశుద్ధ్యం పనులు చేపట్టాలన్నారు. గ్రామాలలో నివసించే ప్రజలకు ప్రాణనష్టం జరగకుండా చూడాలన్నారు. వర్షానికి డ్రైనేజీలలో చెత్తాచెదారం పేరుకుపోకుండా శుభ్రం చేయించాలన్నారు. వర్షం నీరు నిలువ ఉంచకుండా ముందుకు ప్రవహించే లా డ్రైన్లను శుభ్రం చేయాలన్నారు. త్రాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా మిషన్ భగీరథ అధికారులు గ్రామాల్లో పర్యటించి పైప్ లైన్ లీకేజీలను గుర్తించి వెంటనే మరమ్మతులు చేయించాలన్నారు. ఈ జూమ్ మీటింగ్ లో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES