– రోహిత్, కోహ్లి ర్యాంకింగ్స్ మెరుగు
– ఐసిసి వన్డే ర్యాంకింగ్స్ విడుదల
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ తన అగ్రస్థానాన్ని నిలుపుకోగా.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ర్యాంకింగ్స్‌లో ఏకంగా 2, 4వ స్థానాలకు ఎగబాకారు. ఐసిసి బుధవారం ప్రకటించిన వన్డే బ్యాటర్ల జాబితాలో గిల్(784పాయింట్లు) టాప్‌లో నిలువగా.. పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ అజామ్ 739 పాయింట్లతో మూడోస్థానానికి పడిపోగా.. రోహిత్ 756పాయింట్లతో 2వ, కోహ్లి 736పాయింట్లతో 4వ స్థానంలో నిలిచాడు. మరో భారత బ్యాటర్ శ్రేయస్ టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ చివరగా తమ వన్డే మ్యాచ్‌ను యుఎఇ వేదికగా జరిగిన ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడారు. శ్రేయస్ 704పాయింట్లతో 8వ స్థానంలో నిలిచాడు. దీంతో ఐసిసి ప్రకటించిన తాజా బ్యాటర్ల జాబితాలో భాగంగా టాప్-10లో నలుగురు బ్యాటర్లకు చోటు దక్కడం విశేషం.