Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంస్వర్గానికి వెళ్లేందుకే..

స్వర్గానికి వెళ్లేందుకే..

- Advertisement -

శాంతి ప్రయత్నాలపై ట్రంప్‌
వాషింగ్టన్‌ :
రష్యా, ఉక్రెయిన్‌ మధ్య జరుగుతున్న ఘర్షణలను నివారించడానికి తాను చేస్తున్న ప్రయత్నాలకు ఆధ్యాత్మిక ఆకాంక్షలే కారణమని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చెప్పారు. స్వర్గంలో చోటు సంపాదించుకోవడానికి ఈ ప్రయత్నాలు దోహదపడతాయని తాను భావిస్తున్నానని తెలిపారు. ‘ఫాక్స్‌ అండ్‌ ఫ్రెండ్స్‌’ టాక్‌ షోకు ఆయన మంగళవారం ఫోన్‌ ఇంటర్వ్యూ ఇస్తూ ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఆపేయడానికి తాను ఎందుకు చర్యలు చేపట్టాల్సి వచ్చిందనే విషయంపై సరికొత్త వివరణ ఇచ్చారు. యుద్ధ నివారణ కోసం రష్యా, ఉక్రెయిన్‌ అధ్యక్షులు పుతిన్‌, జెలెన్‌స్కీ మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తున్నానని చెప్పుకొచ్చారు.
‘యుద్ధంలో వారానికి ఏడు వేల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోకుండా రక్షించగలిగితే స్వర్గానికి పోతానన్నది నా భావన. దానికోసం ప్రయత్నించాలని అనుకుంటున్నా. నేను సరిగా పనిచేయడం లేదని అంటున్నారు. నిజంగా నేను అట్టడుగు స్థానంలో ఉన్నా. కానీ నేను స్వర్గానికి వెళితే మాత్రం అందుకు ఇది ఓ కారణం అవుతుంది’ అని ఫాక్స్‌ న్యూస్‌ అతిథుల నవ్వుల మధ్య ట్రంప్‌ తెలిపారు. దక్షిణాసియా వ్యవహారాల్లో గతంలో జోక్యం చేసుకున్న విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ ప్రస్తుత ప్రయత్నాలను దానితో పోల్చారు. ‘భారత్‌, పాకిస్తాన్‌ దేశాల్లో అనేక మంది ప్రాణాలను కాపాడానని అనుకుంటున్నా. అక్కడ విమానాలను కూల్చేశారు. నేను అలాగే వదిలేస్తే అణు యుద్ధం జరిగి ఉండేది. నేను వాణిజ్యం ద్వారా పని పూర్తి చేశా’ అని చెప్పారు.
కాగా ట్రంప్‌ వ్యాఖ్యలపై ఆయన ప్రతినిధి కరోలిన్‌ లీవిట్‌ వివరణ ఇచ్చారు. దౌత్యం ద్వారా ప్రాణాలను కాపాడడం ఉన్నతమైన కార్యమని ట్రంప్‌ భావిస్తున్నారని, ఒక దౌత్యవేత్తగా, విశ్వాసం కలిగిన వ్యక్తిగా ఆయన ఈ పనిని చాలా చిత్తశుద్ధితో చేస్తున్నారని ఆమె తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad