- Advertisement -
టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి
సమస్యలను వెలికితీయడంలో నవతెలంగాణ నిరంతరం కృషి చేస్తూ పేదల పక్షపాతిగా ప్రజల మన్ననలు పొందుతోంది. ప్రజా సమస్యలను గుర్తించడమే లక్ష్యంగా, పేద, కార్మిక, శ్రామిక వర్గాలకు అండగా నవ తెలంగాణ చేస్తున్న కృషి అభినందనీయం. పేద ప్రజలకు తోడుగా, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా, ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా, కరదీపికగా నవతెలంగాణ పని చేస్తోంది. ప్రశ్నించే గొంతుక.. కార్మిక, కర్షకుల పక్షాన నిలబడుతూ విజయవంతంగా మరెన్నో వార్షికోత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ నవతెలంగాణకు పదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
- Advertisement -