Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంటీజీ జెన్‌కోలో ఎస్సీఎస్టీ కమిషన్‌ సమీక్ష

టీజీ జెన్‌కోలో ఎస్సీఎస్టీ కమిషన్‌ సమీక్ష

- Advertisement -

– వర్గీకరణ అమలు చేయాలి-ఎమ్‌ఈఎఫ్‌ డిమాండ్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

తెలంగాణ పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్‌ (టీజీజెన్‌కో)లో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సమీక్ష నిర్వహించింది. బుధవారం విద్యుత్‌ సౌధలోని ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కమిషన్‌ చైర్మెన్‌ బక్కి వెంకటయ్య, సభ్యులు కుస్రం నీలాదేవి, రాంబాబునాయక్‌, కొంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్‌, రేణికుట్ల ప్రవీణ్‌, డిప్యూటీ డైరెక్టర్‌ చరణ్‌దాస్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెన్‌కో సీఎమ్‌డీ డాక్టర్‌ ఎస్‌ హరీశ్‌, డైరెక్టర్లు ఎస్వీ కుమార్‌రాజు, ఏ అజరు, పీ బాలరాజు, వై రాజశేఖరరెడ్డి, బీ నాగ్యా, జీ వీరమహేందర్‌ సంస్థ తరఫున పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెన్‌కోలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల అమలు, పదోన్నతులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌, రోస్టర్‌ పాయింట్లు, బ్యాక్‌లాగ్‌ పోస్టులు వంటి వివరాలను కమిషన్‌ అడిగి తెలుసుకుంది. పెండింగ్‌లో ఉన్న సమస్యల్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని కమిషన్‌ అధికారుల్ని ఆదేశించింది. ఉద్యోగులు కూడా సంస్థ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల అసోసియేషన్లతో ప్రతినెలా సమావేశాలు ఏర్పాటు చేయాలని జెన్‌కో హెచ్‌ఆర్‌ విభాగం డైరెక్టర్‌కు దిశానిర్దేశం చేశారు.
పదోన్నతుల్లో వర్గీకరణ అమలు చేయాలి
ఎస్సీ ఉద్యోగుల 15 శాతం రిజర్వేషన్లు, పదోన్నతుల్లో మూడు గ్రూపులుగా వర్గీకరణ చేయాలని మాదిగ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (ఎమ్‌ఈఎఫ్‌) కమిషన్‌ను కోరింది. ఈ మేరకు ఆ సమాఖ్య కార్యదర్శి ఎన్‌ భాస్కర్‌ కమిషన్‌ చైర్మెన్‌కు వినతిపత్రం అందచేశారు. 15 శాతం ఎస్సీ రిజర్వేషన్లలో గ్రూప్‌-1లో ఒక్కశాతం, గ్రూప్‌-2లో 9 శాతం, గ్రూప్‌-3లో 5 శాతం చొప్పున పదోన్నతుల్లో వర్గీకరణ చేసి అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వుల వివరాలను కూడా కమిషన్‌కు అందచేశారు. ఈ మేరకు విద్యుత్‌ సంస్థల సీఎమ్‌డీలకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad