26 గేట్లు 13 అడుగుల మేర ఎత్తివేత
– మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు ొ శ్రీశైలంలో 10 గేట్ల ద్వారా నీటి విడుదల
నవతెలంగాణ – నాగార్జునసాగర్
నాగార్జునసాగర్ జలాశయానికి శ్రీశైలం నుండి భారీగా వరద నీరు వస్తోంది. జలాశయానికి బుధవారం సాయంత్రం 485,872 క్యూసెక్కుల నీరు వస్తుండగా.. 4,78384 క్యూసెక్కులను బయటకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు వరద మరింత పెరిగే అవకాశం ఉండటం తో దిగువ ప్రాంతాలకు డ్యామ్ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నాగార్జునసాగర్‌లో ప్రస్తుతం 26 క్రస్ట్ గేట్లను 13 అడుగుల మేరకు ఎత్తి 4,28,834 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. నీటి విడుదల పరిమాణాన్ని మరింత పెంచే అవకాశముందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో 590 అడుగులకు గాను 583.70 అడుగులుగా ఉంది. శ్రీశైలంలో 885 అడుగుల నీటి మట్టానికి గాను 881.80 అడుగులుగా ఉంది. 10 క్రస్ట్ గేట్లను 18 అడుగుల మేరకు ఎత్తి సాగర్‌కు నీటి విడుదల చేస్తున్నారు.