Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్గోల్కొండ అకాడమీ ఆధ్వర్యంలో బుక్కుల అందజేత

గోల్కొండ అకాడమీ ఆధ్వర్యంలో బుక్కుల అందజేత

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీలో వివిధ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న  విద్యార్థులకు బుక్స్ లను గోల్కొండ అకాడమీ బృందం అద్వర్యంలో గురువారం అందజేశారు. ఈ సందర్భంగా గోల్కొండ అకాడమీ చైర్మన్ సైదులు బెల్లంకొండ మాట్లాడుతూ.. యూనివర్సిటీ లో చదువుతున్న  నిరుద్యోగులు విద్యార్థులు ఎక్కడో మారుమూల గ్రామీణ ప్రాంతాల నుంచి యూనివర్సిటీలో చదువుతున్నారని,  ఈ బుక్స్ లు అలాంటి వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు.

ఏ విధంగా ప్రతిభ ఉన్న చదువుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారికి ఫ్రీ కోచింగ్ కల్పిస్తామని హామీ ఇచ్చారు.బిఆర్ఎస్వి అధ్యక్షుడు శీను రాథోడ్ మాట్లాడుతూ ..యూనివర్సిటీకి వచ్చి వివిధ పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ విద్యార్థుల కోసం యూనివర్సిటీకి వచ్చి వారిలో ధైర్యం నింపినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ విద్యార్థులు, సునీల్, రాజు పటేల్, సందీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad