ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా..
నవతెలంగాణ – జన్నారం
విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని కోర్టూర్ ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా అన్నారు. గురువారం మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాలను వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని పలు రికార్డులను పరిశీలించారు,కిచెన్, తోపాటు ఆర్వో వాటర్ ప్లాంట్ తనిఖీ చేశారు. క్లాస్ రూమ్ లో విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులకు ఉన్న పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు, ఆశ్రమ పాఠశాల లో పలు సమస్యలను గుర్తించారు.
ఇన్చార్జి వార్డెన్ గణేష్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్లో ఫ్యాన్లు ఆర్ఓ ప్లాంట్ ఇతర సమస్యలన్నీ సాయంత్రం కల్లా పరిష్కరించాలని అక్కడే ఉన్న డిటిడిఓ జనార్దన్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఐటిడిఏ పిఓ కుష్బూ గుప్తా మాట్లాడుతూ.. స్కూల్లో మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందడం లేదని, స్కూల్లో ఫ్యాన్లు, ఆర్ఓ ప్లాంట్ పనిచేయడం లేదనీ గుర్తించామన్నారు, రెండు రోజుల్లో ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని డిటిడిఓకు ఆదేశించామన్నారు. విద్యార్థులకు ఇకనుండి మెనూ ప్రకారం తప్పకుండా భోజనం అందివ్వాలని లేదంటే శాఖ పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES