- Advertisement -
నవతెలంగాణ – సదాశివ నగర్
మండలంలోని ఉత్తనూరు గ్రామంలో డ్రోన్ ద్వారా నానో యూరియా నానో పొటాష్ మొక్కజొన్న లో కత్తెర పురుగు నివారణ కొరకు గురువారం పురుగుల మందుతో కలిపి పిచికారి చేయడం జరిగింది. దీనివలన రైతులకు సమయము లేబర్ఆదా అవ్వడంతో పాటు ఖర్చు కూడా తగ్గింది . ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కే ప్రజాపతి,వ్యవసాయ విస్తరణ అధికారి సిహెచ్ ప్రణీత, పిఎసిఎస్ ఉత్తనూర్ సీఈవో నయీమ్, శివాజీ పిఎసిఎస్ ఉత్తనూర్ చైర్మన్ కే ప్రభాకర్ రావు , రైతులు రామారావు స్వామి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -