నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూర్ పట్టణ కేంద్రంలో బిఆర్ఎస్, బీఎస్పీ పార్టీ నుండి గురువారం 50 మంది యువ నాయకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ సలహాదారులు, మాజీమంత్రి మహమ్మద్ షబ్బీర్ అలీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమ్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు శ్రీరామ్ వెంకటేష్, పట్టణ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, సొసైటీ చైర్మన్ భూమయ్య, సీనియర్, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్, బీఎస్పీ నుండి కాంగ్రెస్‌లో భారీగా చేరికలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES