యు.ఎస్.పి.సి జిల్లా నాయకులు చేప బాబు దొర
నవతెలంగాణ – గోవిందరావుపేట
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యల పరిష్కారం పట్ల నిర్వహిస్తున్న జాప్యానికి నిరసనగా ఈనెల 23న హైదరాబాద్లో జరిగే ధర్నాను ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని యుఎస్పిసి జిల్లా నాయకులు చాప బాబు దొర, రెడ్డి వాసుదేవరెడ్డి లు పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చలువాయి నందు యూఎస్ పిసి ములుగు జిల్లా నాయకులు చేప బాబు దొర,రెడ్డి వాసుదేవ రెడ్డి,హట్కర్ సమ్మయ్య నేతలు మాట్లాడుతూ 23:8:2025న హైదరాబాదులోని ధర్నా చౌక్ లో జరగబోయే ధర్నా కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని కోరడం జరిగింది. విద్య, ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలపై అనేకమార్లు ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించినప్పటికిని ప్రభుత్వము తీవ్ర జాప్యం చేయడం వలన ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించవలసి వస్తుందని నాయకులు తెలిపారు.
ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని నూతన జిల్లాలకు డివోలను, ప్రతి రెవెన్యూ డివిజన్ కు డిప్యూటీ డీఈవోను నూతన మండలాలకు, ఎం ఈ ఓ పోస్టులను ఉపాధ్యాయుల ఏకృత సర్వీసు అమలు చేసి అన్ని రకాల ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని తెలియజేయడం జరిగింది ఉపాధ్యాయుల పెన్షనర్ల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, ఖాళీలుగా పి ఎస్ హెచ్ యం పోస్టులను వెంటనే భర్తీ చేయాలని జీవో నెంబర్ 2. 3.9. 10 రద్దుచేసి జీవో 11, 12 లను అమలు చేసి ఉపాధ్యాయులకు వెంటనే ప్రమోషన్లు కల్పించాలని, గురుకుల టైం టేబుల్ సవరించాలని, కేజీబీవీ,మోడల్ స్కూల్ ఎయిడెడ్, ట్రైబల్ వెల్ఫేర్ మొదలగు వాటిలో ఉన్న అన్నిసమస్యలను వెంటనే పరిష్కరించాలని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది, జులై 23, 24, 25 తేదీలలో తేదీలలో తాసిల్దార్ల ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది, ఆగస్టు 5న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించి కలెక్టర్ గారికి ప్రాతినిధ్యాలు చేయడం జరిగింది. ప్రభుత్వము ప్రతిస్పందించకపోవడంతో 23న హైదరాబాదులో ధర్నా చౌక్ లో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టామని నాయకులు తెలపడం జరిగింది. ఉద్యోగ ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
23న హైదరాబాద్ ధర్నాను జయప్రదం చేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES