నవతెలంగాణ – భీంగల్
మండలంలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు ఈరోజు టి ఎల్ ఎం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మేలా కార్యక్రమం భీంగల్ మండల విద్యాధికారి డి, స్వామి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ టిఎల్ఎమ్ మేళ ద్వారా విద్యార్థులకు సులభ పద్ధతిలో అర్థమయ్యే రీతిలో బోధన చేసేందుకు వివిధ రకాల ఆకృతులతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు రూపొందించిన మేళాను మండల పరిషత్ అభివృద్ధి అధికారి గంగుల సంతోష్ కుమార్ సందర్శించి, సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ… ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి టిఎల్ఎం మేళ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ప్రైవేట్ రంగ సంస్థలకు దీటుగా అన్ని రంగాల్లో ప్రభుత్వ పాఠశాలలే ముందున్నాయని, విద్యార్థులు వారి తల్లిదండ్రులు మన ఊరు మన ప్రభుత్వబడిలో చేర్పించాలని ఎంపీడీవో సంతోష్ కుమార్ అన్నారు. విద్యార్థులకు సులభ పద్ధతిలో అర్థమయ్యేలా రూపొందించిన మెటీరియల్ను పరిశీలించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన పాఠశాలకు ప్రశంసా పత్రాలు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎఫ్ ఎల్ ఎన్ మండల నోడల్ అధికారి ఏ.రమేష్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు జెవి. అనురాధ, భీంగల్ మండలం పి.ఆర్.టి.యు అధ్యక్షులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శేఖర్, భీంగల్ మండల ఎస్ జి టి అధ్యక్షులు నవీన్, ఉపాధ్యక్షులు, మండలంలోని అన్ని ప్రాథమిక, ప్రథమికోన్నత్త పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పాల్గొన్నారు.
మండల స్థాయి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ను సందర్శించిన ఎంపీడీఓ గంగుల సంతోష్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES