నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని నమాతుపల్లి, బండ సోమారం, గౌస్ నగర్, తుక్కాపురం, ఎర్రంబెల్లి, కేసారం, బాలంపల్లి, రామచంద్రపురం, పెంచికలపహాడ్ గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్ ఎం డి ఏ నిధులతో సిసి రోడ్డు నిర్మాణ పనులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు. భువనగిరి మండలం బండ సోమారం గ్రామంలో ఇంటి నిర్మాణం పూర్తయిన వారికి నూతన పట్టు వస్త్రాలను అందజేశారు. ఎన్నో ఏళ్లుగా పేదలు ఇండ్లు లేక ఇబ్బందులు పడుతుండడంతో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పేదల సొంతింటి కలను నెరవేర్చడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఎలిమినేటి కృష్ణారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిక్కుల వెంకటేశం, పచ్చిమట్ల శివరాజ్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిన్నం శ్రీనివాస్, ఎడ్ల శ్రీనివాస్, ఎల్లంల జంగయ్య యాదవ్, నానం కృష్ణ గౌడ్, ఫకీర్ కొండల్ రెడ్డి, పాక వెంకటేష్ యాదవ్, ఏడుమేకల మహేష్ యాదవ్, ఎంపీడీవో సిహెచ్ శ్రీనివాస్, హౌసింగ్, పంచాయతీ రాజ్ ఏ ఈ లు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES