నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని బొల్లెపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలను, నందనం గ్రామంలో ప్రాథమిక పాఠశాలను గురువారం జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వం విద్యా వ్యవస్థకి పెద్దపీట వేసిందని, విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలనీ అన్నారు. అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించి, స్కూల్ లో ఎంత మంది ఉపాధ్యాయులు ఉన్నారని, అందరూ విధులకు హాజరయ్యారా అని అటెండెన్స్ రిజిస్టర్ ను పరిశీలించారు.పదవ తరగతిలో ఎంత మంది విద్యార్థులు చదువుతున్నారని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఇప్పటివరకు పదవ తరగతిలో సబ్జెక్ట్ ల వారీగా సిలబస్ ఎంత వరకు పూర్తి చేశారని తెలుసుకున్నారు.గత సంవత్సరం లో 10 వ తరగతిలో పాస్ ఎంత మంది విద్యార్థులకు పర్సంటేజ్ ఎంత వచ్చిందని అడిగారు. ఈ సంవత్సరం కూడా 100 % ఉత్తీర్ణత సాధించేలా టీచర్లు కృషి చేయాలని,ఇప్పటినుండే వాళ్ళకీ అర్థమయ్యేలా బోధన చేయాలన్నారు. ఉపాధ్యాయులు సబ్జెక్టులలో వెనకబడి ఉన్న విద్యార్థులకు స్పెషల్ క్లాస్ నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.