నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి జిల్లా కేంద్రంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో భువనగిరి మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అజయ్ ఆధ్వర్యంలో టీ షర్ట్ కంపెనీలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అర్జునయ్య మాట్లాడుతూ కంపెనీలో ఊహించని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. పని జరిగే ప్రదేశాలలో మహిళలకు ఏమైనా ఇబ్బందులు తలెత్తితే 100 డయల్ చేయాలని కోరారు. మహిళల సమస్యలపై మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో ఎస్సై అండాలు, ఏ ఎస్ ఐ రాములు, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ చారి, రమేష్, మహిళా పోలీస్ కానిస్టేబుల్ సునీత, సి డి ఈ డబ్ల్యూ కౌన్సిలర్స్ సరిత, స్వర్ణలత , ప్రసన్న లక్ష్మి స్నేహలత లు పాల్గొన్నారు.