Friday, August 22, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే కుంభం

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే కుంభం

- Advertisement -

నవతెలంగాణ – వలిగొండ రూరల్
మండలంలోని నాతాళ్లగూడెంలో  కొత్తగా ఇందిరమ్మ ఇంటిని నిర్మించుకున్న మనోహర లింగస్వామి గృహప్రవేశానికి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ముఖ్య  అతిథిగా హాజరై ఇంటి నిర్మాణ లబ్ధిదారులకు నూతన వస్త్రాలను గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో ఒక్క ఇల్లు ఇవ్వలేదని, ప్రస్తుతం ప్రజా ప్రభుత్వంలో పేదలకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత బస్సు సౌకర్యం ఎన్నో సంక్షేమ కార్యక్రమసలు అందుస్తుoదని  అన్నారు.  ఇండ్లులేని ప్రతి నిరుపేదకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి ఇంటిని నిర్మిస్తుందని తెలిపి నూతనంగా ఇంటి నిర్మించుకున్న కుటుంబాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ భీమా నాయక్, పాశం సత్తిరెడ్డి, చిట్టెడి  జనార్దన్ రెడ్డి, నూతి రమెష్, పలుసం సతీష్,  గరిసె రవి, చిలుగూరి సత్తిరెడ్డి, కంకల కిష్టయ్య, సహదేవ్, ఉలిపే మల్లేష్, బాలరాజు, భాస్కర్, ఎంపీడీవో జలంధర్ రెడ్డి, హౌసీసీ ఈఈ నాగేశ్వర్, ఏఈ కిరణ్, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి తదితరులు  పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad