ట్రంప్‌ను హెచ్చరించినహేలీ
వాషింగ్టన్ : ఆసియాలో అత్యంత కీలక ప్రజాస్వామిక మిత్రదేశమైన భారత్‌తో సంబంధాలు ప్రమాదకర స్థాయిలో క్షీణిస్తున్నాయని ఐక్యరాజ్యస మితిలో అమెరికా రాయబారిగా పనిచేసిన నిక్కీ హేలీ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను హెచ్చరించా రు. ట్రంప్ ప్రభుత్వం ఇటీవల తీసుకుంటున్న చర్యలను ‘వ్యూహాత్మక విపత్తు’గా ఆమె అభివర్ణించా రు. పెరుగుతున్న సుంకాల బెదిరింపులు, దౌత్యపరమైన ఉద్రిక్తతల మధ్య భారత్ పట్ల తన వైఖరిని ట్రంప్ పునరాలోచించుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆమె ‘న్యూస్‌వీక్’ పత్రికలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వ్యాసాన్ని రాశారు. స్వేచ్ఛాయుత ప్రపంచానికి భారత్ ముప్పు కలిగించదని తెలిపారు.
రష్యా నుంచి భారత్ పెద్ద ఎత్తున జరుపు తున్న చమురు కొనుగోళ్లు ఉక్రెయిన్‌లో పుతిన్ సాగిస్తున్న యుద్ధానికి నిధులు సమకూరుస్తా యని హేలీ చెప్పారు. అయితే రష్యా ఇంధనాన్ని అధికంగా వినియోగిస్తున్న చైనాపై అమెరికా పెద్దగా ఆంక్షలు విధించలేదని, తద్వారా ద్వంద్వ ప్రమాణాలు పాటించిందని విమర్శించారు. ‘ఈ వివక్ష నేపథ్యంలో భారత్-అమెరికా సంబంధాలను నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. లేనిపక్షంలో వాస్తవాలు చాలా కఠినంగా ఉంటాయి’ అని అన్నారు. చైనా నుంచి సరఫరాలను తగ్గించుకోవాలంటే భారత్ సహకారం తప్పనిసరి అని చెప్పారు. ‘తయారీ రంగాన్ని తిరిగి అమెరికాకు తీసుకురావడానికి ట్రంప్ ప్రభుత్వం కృషి చేస్తోంది. అయితే ఇక్కడ ఉత్పత్తి చేయలేని వస్త్రాలు, ఫోన్లు, సౌర ఫలకాలను వేగంగా, చౌకగా తయారు చేసే సామర్ధ్యం భారత్‌కు ఉంది’ అని హేలీ తెలిపారు.
భారత్‌తో సంబంధాలు క్షీణిస్తున్నాయి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES