రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్
నవతెలంగాణ – కంఠేశ్వర్
యూరియా అంశంలో రైతులకు ఆందోళన అవసరములేదని రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రెండు లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు రాష్ట్రానికి తీసుకురావాలన్నారు. నిజామాబాద్ రూరల్ పరిధిలో గల ఖానాపూర్ లో యూరియా గోదాములను ఆయన, జిల్లా వ్యవసాయ అధికారి గోవిందుతో కలిసి శుక్రవారం పరిశీలించారు. 53 సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూరియా విషయంలో కేంద్ర మంత్రులు, విపక్షాలు రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. యూరియా కొరత ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించాలన్నారు. నిజామాబాద్ జిల్లాకు ఆరువేల మెట్రిక్ టన్నుల యూరియా రాగా, ఇంకా 4000 టన్నుల యూరియా రావాల్సి ఉందన్నారు. యూరియా విషయంలో కాంగ్రెస్ పార్టీపై, రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES