Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఆయిల్ ఫామ్ తోటల పరిశీలన

ఆయిల్ ఫామ్ తోటల పరిశీలన

- Advertisement -

– ఏర్గట్ల మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు
– ఆయిల్ ఫామ్ సాగుకు రైతుంగం ముందుకు రావాలి 
– మండల వ్యవసాయ అధికారిని రమ్యశ్రీ 
నవతెలంగాణ-కమ్మర్ పల్లి  
మండలంలోని ఉప్లూర్ గ్రామంలో కోతకు వచ్చిన ఆయిల్ పామ్ తోటలను మండల వ్యవసాయ అధికారిని రమ్యశ్రీ పరిశీలించారు. ఈ మేరకు శనివారం వ్యవసాయ విస్తీర్ణ అధికారి రమేష్ తో కలిసి కోతకు వచ్చిన స్థానిక రైతు బద్దం చిన్నారెడ్డి ఆయిల్ ఫామ్ తోటను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారిని రమ్యశ్రీ మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ పంట తక్కువ శ్రమతో ఎక్కువ రాబడి ఉంటుందని, ఆయిల్ ఫామ్ సాగుకు రైతుంగం ముందుకు రావాలని కోరారు. రైతుల సౌకర్యార్థం ఏర్గట్ల మండల కేంద్రంలో ఆయిల్ ఫామ్ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ముఖ్యంగా ఈ పంట కొనుగోలుకు దళారీ వ్యవస్థ లేదన్నారు. ఈ పంటకి ఒక చట్టం చేయబడిందని, అమ్మకం కొనుగోలు అంతా చట్ట పరిధి ప్రకారం జరుగుతుందన్నారు.

ఈ పంటను కోసిన 24గంటల లోపు పంట అమ్మడం పూర్తి అవుతుందని, గాలివాన, గాలిదుమారం ఏవీ ఈ పంటను ఏమీ చేయలేవన్నారు. మన మండలంలో ఆయిల్ ఫామ్ పంట సాగుకు చాలా అనుకూలమైన నేలలు ఉన్నాయన్నారు.కూలీల అవసరం తక్కువగా ఉంటుందని తెలిపారు.ఆయిల్ పామ్ పంట దిగుబడి 4వ సంవత్సరం నుండి మొదలై 35 నుండి 40 సంవత్సరాల వరకు ప్రతి 15 రోజులకీ ఒకసారి దిగుబడి ఇస్తుందన్నారు.మొదటి 3 సంవత్సరాలు అంతర పంటలు వేసుకొని ఆదాయం పొందవచ్చని సూచించారు.మొదటి 4 సంవత్సరాల వరకు  ఒక ఎకరానికి రూ.4200  చొప్పున రూ.16800  ప్రభుత్వం పెట్టుబడి సహాయ రూపంలో ఇస్తుందన్నారు.

ఈ పంటను ఉపాధి హామీ పథకంలో బాగంగా మొక్కలు కూలీలతో నాటించుకోవచ్చని రైతులకు సూచించారు. ఆయిల్ ఫామ్ మొక్కలను 90 శాతం ప్రభుత్వ రాయితీతో కేవలం 20 రూపాయలకి ఒక మొక్క చొప్పున ఎకరానికి 50 మొక్కలు1000 రూపాయలకే రైతులకు ఫ్రీ యూనికి కంపెనీ సరఫరా చేస్తుందన్నారు. ఈ పంటకు బిందు సేద్య పరికరాలు 80-100 శాతం వరకు సబ్సిడి ద్వారా ప్రభుత్వం అందిస్తుందని  మండల వ్యవసాయ అధికారి రమ్యశ్రీ తెలిపారు. ప్రభుత్వం అందించే సదుపాయాలను సద్వినియోగం చేసుకొని రైతులు ఆయిల్ ఫామ్ పంటను సాగు చేసి, అధిక లాభాలు పొందాలని ఆమె కోరారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad