రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
నవతెలంగాణ – మిరుదొడ్డి
విద్యార్థులకు మంచి విద్య బోధన అందించాలని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. శనివారం అక్బరుపేట భూంపల్లి మండల కేంద్రంలో భూంపల్లి ప్రభుత్వ పాఠశాలలో మండల విద్యాశాఖ అధికారి దోమకొండ అంజగౌడ్ ఆధ్వర్యంలో మండల స్థాయి ఎఫ్ఎల్ ఎమ్, టీఎల్ ఎం మేళ నిర్వహించారు. విద్యార్థులకు మంచి బోధన అందించడానికి ఉపాధ్యాయులు కృషి ఎంతో ఉండాలని సూచించారు. నేటి బాలురు రేపటి భాయ్ భారత పౌరులుగా తీర్చిద్దడానికి ఉపాధ్యాయుల కృషి ఎంతో అవసరమని అన్నారు. విద్యార్థులకు పాఠశాలలో అనేక సౌకర్యాలు కల్పించాలని తెలిపారు.
విద్యార్థుల సౌకర్యాల వల్ల ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పు అన్నారు. అనంతరం జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, మండల తహశీల్దార్ మల్లికార్జున్ రెడ్డి లు కలిసి జ్యోతి ని వెలిగించి ప్రారంభించారు. ,ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు బోధన అభ్యాసన సామగ్రి ఉపయోగించడం ద్వారా విద్యార్థులకు అర్థవంతంగా బోధన అందుతుందనీ, రాష్ట్ర విద్యా వ్యవస్థలో అక్బరుపేట భూంపల్లి మండలం ముందంజలో ఉండేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కాంప్లెక్స్ హెడ్మాస్టర్ రాజేందర్,చిట్టాపూర్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ బాలకిషన్,మాజీ ఎంపిటిసి అబ్బుల ఉమారాణి బాలగౌడ్,నాయకులు పాపని సురేష్,చాకలి రంజిత్,అనిల్,మండలం లోని ప్రభుత్వ పాటశాలల ఉపాధ్యాయులు పలువురు పాల్గొన్నారు.
విద్యార్థులకు మంచి విద్య బోధన అందించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES