నవతెలంగాణ – అశ్వారావుపేట
వయోభారంతో కూడిన అనారోగ్యంతో శనివారం మృతి చెందిన సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, నల్గొండ పార్లమెంట్ మాజీ సభ్యులు సురవరం సుధాకర్ రెడ్డి కి సిపిఐ అశ్వారావుపేట మండల సమితి ఆద్వర్యంలో శనివారం పార్టీ శ్రేణులు నివాళులు అర్పించారు. అనంతరం నియోజకవర్గ కార్యదర్శి సయ్యద్ సలీం మాట్లాడుతూ సీపీఐ విస్తరణ కోసం సుధాకర్ రెడ్డి చేసిన కృషి వెలకట్టలేనిది అన్నారు.కొన్ని దశాబ్దాలుగా ఎన్నో ప్రజా ఉద్యమాలలో, భూ పోరాటాలలో పాలు పంచుకొని పేద ప్రజల పక్షాన నిలబడి పనిచేశారని అన్నారు.
ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తు తరాలు ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సమితి సభ్యులు గన్నిన రామకృష్ణ,పట్టణ కార్యదర్శి విజయ్,మహిళా సంఘం నాయకులు చీపుర్ల సత్యవతి, ఎస్.కె రిజ్వానా,యువజన సంఘం నాయకులు సయ్యద్ రజ్వీ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సూర్యకుమారి,రసూల్ బి, కణితి శ్రావణి,రాధ, ఏఐటీయూసీ నాయకులు షేక్ అబ్బాస్,పి.చిన్నారావు,వాసు తదితరులు పాల్గొన్నారు.
సురవరం సుధాకర్ రెడ్డికి సీపీఐ నివాళులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES