గత నెల మించి ఈ నెల గెలలు వచ్చే అవకాశం
ఇప్పటికే 30 వేలు టన్నుల గెలలు రాక
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఈ ఏడాది వ్యవసాయ ప్రారంభంలో పామాయిల్ మొక్కలు కోసం వాహనాలు బారులు తీర గా నేడు ఆయిల్ ఫాం గెలలు దిగుబడులు అధికం కావడంతో గెలలు వాహనాలు పరిశ్రమలో దిగుమతి చేయడానికి బారులు తీరాయి. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జులై నెలలో మొత్తం 30 రోజులకు రెండు పరిశ్రమల పరిధిలో 38341.100 మెట్రిక్ టన్నులు గెలలు దిగుబడి అయ్యాయి.
కానీ ఆగస్ట్ లో 22 తేదీ శుక్రవారం వరకే 31628.830 మెట్రిక్ టన్నులు గెలలు గానుగ ఆడారు.శనివారం వార్త రాసే సమయానికే అశ్వారావుపేట లో 880,అప్పారావు పేట లో 2100 టన్నులు మొత్తంగా 2980 మెట్రిక్ టన్నుల గెలలు పేరుకుపోయాయి. ఈ లెక్కన జులై నెల కంటే ఆగస్ట్ లో గెలలు ఇంకా పెరిగే అవకాశం ఉందని ఇరు పరిశ్రమల మేనేజర్ లు ఎం.నాగబాబు,జి.కళ్యాణ్ గౌడ్ లు తెలిపారు.