నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
వ్యవసాయ యాంత్రీకరణపై ఉప మిషన్ సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకాగ్నియేషన్ 2025-26 కేంద్ర ప్రభుత్వ పథకంలో బాగంగా రైతులకు రాయితీపై వ్యవసాయ పనిముట్లు అందజేయడం జరుగుతుందని మండల వ్యవసాయ శాఖ అధికారి కిషన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, మహిళా, చిన్న, సన్నకారు (5ఎకరాల లోపు ఉన్న) రైతులకు 50శాతం సబ్సిడీ పై పనిముట్లు అందజేసినట్టు, పెద్ద కారు రైతులకు 40శాతం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కావాల్సిన ధృవ పత్రాలు అప్లికేషన్ ఫారం, పట్టదార్ పాస్ పుస్తకం (జిరాక్స్ ), ఆధార్ కార్డు జిరాక్స్, ట్రాక్టర్ ఆర్సి జిరాక్స్ మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో అందజేయాలని తెలిపారు. లబ్ది దారుల ఎంపిక తరువాత సంభదిత పరికరం సరఫరా చేసే కంపనీ పేరున డిడి తియ్యాల్సి వుంటుంది పేర్కొన్నారు.
రాయితీపై వ్యవసాయ పనిముట్లు అందజేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES