Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుభారీగా గుట్కా, అంబర్ పట్టివేత

భారీగా గుట్కా, అంబర్ పట్టివేత

- Advertisement -

నమ్మదగిన సమాచారంతో పోలీసుల దాడులు…
నలుగురిపై కేసు నమోదు..
నవతెలంగాణ – కాటారం

కాటారం పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం పలు చోట్ల పోలీసుల తనిఖీల్లో భారీగా నిషేధిత అంబార్, గుట్కా పట్టుబడింది. కాటారం ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని మూడు దుకాణాల్లో, దేవరాంపల్లి లోని మరో దుకాణంలో నమ్మదగిన సమాచారం మేరకు తనిఖీలు చేశామని తెలిపారు. ఈ దాడుల్లో నిషేధిత అంబార్, గుట్కా ప్యాకెట్లు దొరికాయని వెల్లడించారు. ఈ క్రమంలో బీరెల్లి రమేష్, చౌదరి జాంతారామ్, అల్లాడి ప్రవీణ్, అనంతుల రాజసమయ్యలపై కేసు నమోదు చేశామని తెలిపారు. దాదాపుగా రూ.3 లక్షల 2వేల విలువ గల గుట్కా, అంబార్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. కాటారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా నిషేధిత వస్తువులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్బంగా పోలీసులు హెచ్చరించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad