- Advertisement -
నవతెలంగాణ-నిజాంసాగర్
ప్రాజెక్టులో పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రంలోనీ నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్సై శివకుమార్ కథనం ప్రకారం.. పిట్లం మండలం అల్లాపూర్ గ్రామానికి చెందిన గైని పండరి (30) నిజాంసాగర్ ప్రాజెక్టుకు తన బైక్ పై వచ్చి ప్రాజెక్టులోకి దూకాడు. స్థానికంగా ఉన్న పర్యాటకులు చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై ఘటన స్థలానికి వచ్చి మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆత్మహత్య కు గల కారణాలను ఎస్సై మృతదేహం లభ్యమైన తర్వాత తెలుపుతామని ఎస్ఐ తెలిపారు.
- Advertisement -