- Advertisement -
నవతెలంగాణ-మిరుదొడ్డి: మిరుదొడ్డి అల్వాల గ్రామం రామాలయం దేవాలయం పునర్నిర్మాణం కోసం శనివారం దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి.. హైదరాబాద్ లోని అటవీ శాఖ, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖను మర్యాదపూర్వకంగా కలిసి మెమోరండం అందజేశారు. మంత్రి సానుకూలంగా స్పందించి ఆలయం పునర్నిర్మాణం కోసం ప్రత్యేక చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అల్వాల గ్రామ తాజా మాజీ సర్పంచ్ ఎనగంటి కిష్టయ్య, గ్రామ అధ్యక్షులు నీరుటి రాజు, మట్టె సత్యనారాయణ రెడ్డి, గుల్ల నర్సింలు, చాకలి స్వామి తదితరులు ఉన్నారు.
- Advertisement -