Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్సమాచార హక్కు చట్టం భారత పార్లమెంటు చేసిన ఒక చట్టం

సమాచార హక్కు చట్టం భారత పార్లమెంటు చేసిన ఒక చట్టం

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి 
సమాచార హక్కు చట్టం  భారత పార్లమెంటు చేసిన ఒక చట్టం అని  సమాచార హక్కు చట్ట రాష్ట్ర డైరెక్టర్  యం. ఏ. సలీం అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా సమీపంలోని  డ్రైవర్స్ కాలనీలో ఉన్న ఉర్దూ మీడియం  ప్రభుత్వ పాఠశాలలో   సమాచార హక్కు చట్టం  2005 పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  భారతీయ పౌరులు ప్రభుత్వ సంస్థల నుండి సమాచారాన్ని పొందేందుకు సమాచార  హక్కు ద్వారా సమాచారాన్ని పొందుతారన్నారు. ఈ చట్టం ప్రభుత్వ కార్యకలాపాలలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచడానికి ఉద్దేశించబడిందన్నారు. దీని కింద, పౌరులు కార్యాలయాల్లోని వివిధ సమాచారం పత్రాలు, రికార్డులు, ఎలక్ట్రానిక్ డేటా వంటి సమాచారాన్ని అభ్యర్థించవచ్చన్నారు. దీని ముఖ్య ఉద్దేశ్యాలు ప్రభుత్వ సంస్థల పనితీరులో పారదర్శకతను పెంచడం, ప్రభుత్వ అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండేలా చూడటం, పౌరులకు సమాచారాన్ని పొందే హక్కును చట్టబద్ధం చేయడం సమాచార హక్కు చట్ట యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు.

భారతీయ పౌరులు ఏ ప్రభుత్వ సంస్థలోనైనా సమాచారం కోసం లిఖితపూర్వకంగా అభ్యర్థన చేయవచ్చని, సమాచార నిబంధన ప్రకారం పౌరులు అభ్యర్థించిన సమాచారాన్ని 30 రోజులలోపు అందించాలన్నారు. ప్రజా అధికారి, ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల నుండి సమాచారాన్ని పొందవచ్చని, అప్పీలు సమాధానం రాకపోతే లేదా అసంతృప్తిగా ఉంటే పౌరులు మొదటి అప్పీలేట్ అధికారిని సంప్రదించవచ్చన్నారు. భారతదేశ పౌరులు మాత్రమే ఈ చట్టం కింద సమాచారం కోసం అభ్యర్థనలు చేయవచ్చానారు. సమాచార హక్కు చట్టం 2005 అక్టోబర్ 12, 2005న భారతదేశమంతటా అమలులోకి వచ్చిందన్నారు. అనంతరం విద్యార్థులకు బుక్స్, పరీక్ష ప్యాడ్ లను అందజేసిన కేతు రమణారెడ్డిని  అభినందించారు. ఇటీవల ప్రభుత్వ అవార్డు అందుకున్న నాజియా మస్రత్ ను పాఠశాల, సమాచార హక్కు చట్టం ఆధ్వర్యంలో  పాఠశాల ఆవరణలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేణు గోపాల్, హ్యూమన్ రైట్స్ రాష్ట్ర సలహాదారు  కేతు రమణ రెడ్డి, అడ్వకేట్ ఈక శ్రీనివాస్ రావు, మోసార్ల శ్రీకాంత్ రెడ్డి, చారి, జావీద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad