- Advertisement -
ఏకగ్రీవంగా ఎన్నికైన భారత దిగ్గజ అథ్లెట్
హైదరాబాద్ : తెలంగాణ ఫెన్సింగ్ సంఘం (టిఎఫ్‌ఏ) అధ్యక్షురాలిగా భారత దిగ్గజ క్రీడాకారిణి, ఒలింపియన్ గుత్తా జ్వాల ఏకగ్రీవంగా ఎన్నికైంది. ప్రధాన కార్యదర్శిగా వై. శ్రీనివాస్ రావు, కోశాధికారిగా ప్రవీణ్ కుమార్, సీనియర్ ఉపాధ్యక్షుడిగా నమహాశివయ్య ఎన్నికయ్యారు. నలుగురు ఉపాధ్యక్షులు, నలుగురు సంయుక్త కార్యదర్శులు, నలుగురు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు టిఎఫ్‌ఏ ఓ ప్రకటనలో తెలిపింది. రిటర్నింగ్ ఆఫీసర్‌గా ధనంజరు నాయుడు వ్యవహరించగా, భారత ఫెన్సింగ్ సమాఖ్య పరిశీలకుడిగా అశోక్ హాజరయ్యారు.
- Advertisement -