రైతులకు మంత్రులు తుమ్మల, శ్రీధర్ బాబు విజ్ఞప్తి
రాష్ట్రానికి సరఫరా పెంచేందుకు అన్ని రకాల చర్యలు
ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ఉత్పత్తి పునరుద్ధరణపై మార్గనిర్దేశం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రానికి యూరియా సరఫరాను పెంచేందుకు తమ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. ప్రతిపక్షాల దుష్ప్రచారంతో రైతులు ఆందోళనకు గురికావొద్దని విజ్ఞప్తి చేశారు. వీలైనంత త్వరగా యూరియా సమస్య తీరుతుందని హామీ ఇచ్చారు. శనివారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్) యాజమాన్యం, వ్యవసాయ, పరిశ్రమల శాఖ ఉన్నతాధి కారులతో మంత్రులు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో యూరియా ఉత్పత్తి నిలిచిపోవడానికి గల కారణాలపై మంత్రులు ఆరా తీశారు. ఈ సీజన్‌లో 145 రోజుల్లో 40 రోజులు మాత్రమే ప్లాంట్ పని చేయడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. తరచుగా ఇలాంటి పరిస్థితులు తలెత్తుతుంటే శాశ్వత చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆర్‌ఎఫ్‌సీఎల్ సీఈవో అలోక్ సింఘాల్‌ను వారు ప్రశ్నించారు. ‘మిమ్మల్ని మేం కేవలం వ్యాపారవేత్తలుగా మాత్రమే చూడటం లేదు. రాష్ట్రాభివృద్ధిలో తమతో కలిసి నడిచే భాగస్వామిగా చూస్తున్నాం’ అని స్పష్టం చేశారు. ప్లాంటు పునరుద్ధరణకు రూపొందించిన యాక్షన్ ప్లాన్‌ను సమీక్షించి మార్గనిర్దేశం చేశారు. ఇతర రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణను చూడొద్దని కోరారు. రామగుండంలో ఉత్పత్తి ప్రారంభమయ్యే వరకు ఆర్‌ఎఫ్‌సీఎల్ మాతృసంస్థ ఎన్‌ఎఫ్‌ఎల్‌కు సంబంధించిన ఇతర ప్లాంట్ల నుంచి తెలంగాణకు ప్రతి రోజు ఒక రేకు యూరియాను సరఫరా చేసేలా చొరవ చూపాలని కోరారు. ఈ విషయంలో కంపెనీకి ఇబ్బందులుం టే కేంద్రంతో మాట్లాడి పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని భరోసానిచ్చారు. సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజరు కుమార్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ఆర్‌ఎఫ్‌సీఎల్ రామగుండం యూనిట్ జీఎం రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.
యూరియాపై ఆందోళన వద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES