పెద్దవూరలో సిద్ధంగా ఉన్న విగ్రహాలు
నవతెలంగాణ-పెద్దవూర
వినాయక చవితి పండుగ సమీపిస్తుండడంతో వేడుకలకు గణనాథులు సిద్ధమవుతున్నారు. ఈనెల 27వ తేదీ వినాయక చవితి పర్వదినం పురష్కరించుకుని వినాయక విగ్రహాల తయారీ కేంద్రాల వద్ద విగ్రహాల అమ్మకాలకు నిర్వాహకులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి వినాయక విగ్రహాల కమిటీవారు వచ్చి చాలా వరకు విగ్రహాలను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.పెద్దవూర మండలం లోని నాగార్జున సాగర్ రోడ్డులో రంగురంగుల వినాయక విగ్రహాలు ప్రత్యేక అలంకరణగా నిలిచాయి. అలాగే ప్రత్యేక ఆకర్షణగా ఓ వినాయక విగ్రహాలను ప్రత్యేక ఆక్షరణగా తయారు చేశారు. గణేష్ చతుర్థి సందర్భంగా వందల సంఖ్యలో విగ్రహాలను ప్రజలు ప్రతిష్ఠించి పూజలు చేయడం ఆనవాయితాగా వస్తోంది. గతంలో కొన్ని కొన్ని గల్లీలలోనే విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేసేవారు. క్రమేణ ప్రతి గల్లీకి మూడు నుంచి నాలుగైదు విగ్రహాలను ప్రతిష్ఠించి వైభవంగా వేడుకలు చేస్తున్నారు. ఇందకు యువత ముందుకు రావడంతో గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
అనుమతులు తీసుకోవాలి: ఎస్ ఐ-ప్రసాద్
పెద్దవూర మండలంలో వినాయ క చవితి సందర్భంగా వినాయక విగ్రహాల ఏర్పాటు, ఉ త్సవాల నిర్వహణ, నిమజ్జనం వివరాలతో ఆ ర్గనైజింగ్ కమిటీ సభ్యులు అనుమతులు తీసుకోవా లని పెద్దవూర ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. ఆర్గ నైజింగ్ కమిటీ సభ్యులు తమ పూర్తి వివరాలు, ఆధార్ కార్డుల జిరాక్స్ లు, ఫోన్ నెంబర్లను అందజేయాలన్నారు. విగ్రహం ఏర్పాటుచేసే ప్రాంతం, ఎన్ని అడుగుల ఎత్తు విగ్రహం ఏర్పాటుచేసేది, ఎన్ని రోజులు ఉత్సవాలు నిర్వహిస్తారో, నిమజ్జనం ఎక్కడ నిర్వహిస్తారో అనే వివరాలతో దరఖాస్తు చేసుకో వాలన్నారు.అంతే గాక శాంతియుత వతావణం లో ఉత్సావాలు జరుపుకోవాలి.నిబంధనలు పాటించకుంటే చర్యలుతీసుకుంటాం.