- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూర్ పట్టణ కేంద్రంలోని బీసీ హాస్టల్‌లో విద్యార్థుల తల్లిదండ్రులతో బీసీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సునీత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల చదువు, ప్రతిభ, ఆరోగ్య సమస్యల గురించి తల్లిదండ్రులతో చర్చించారు. ప్రతిభ, కష్టపడి చదువుతున్న విద్యార్థులను తల్లిదండ్రులు ప్రోత్సహించాలని తెలిపారు. బీసీ హాస్టల్‌లో ఎలాంటి సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని తల్లిదండ్రులకు సూచించారు.
- Advertisement -