నవతెలంగాణ-హైదరాబాద్: గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా సోమవారం తన స్వస్థలమైన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చేరుకున్నారు. కుటుంబసభ్యులతో పాటు మద్దతుదారులు ఆయనకు స్వాగతం పలికారు. ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ లక్నో విమానాశ్రయంలో శుక్లాను స్వాగతించారు. తరువాత, గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా గోమతినగర్‌లోని సిటీ మాంటిస్సోరి స్కూల్‌కు వెళ్లారు, అక్కడ ఆయనకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఇటీవల ఆక్సియమ్ మిషన్ భాగంగా ఫ్లొరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారాశుభాన్షు శుక్లా అంతరిక్షంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. దిగ్విజయంగా ఈ యాత్రను పూర్తి చేసుకొని అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయునిగా రికార్డు సృష్టించారు. ఆతర్వాత నాసా పరివేక్షణలో క్వారంటైన్ పూర్తి చేసుకొని ఇటీవల భారత్‌కు తిరిగివచ్చారు.