– సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గీట్ల ముకుంద రెడ్డి డిమాండ్
నవతెలంగాణ – సైదాపూర్ :సైదాపూర్ మండలంలోని సాగునీటి కాలువల్లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గీట్ల ముకుంద రెడ్డి డిమాండ్ చేశారు. మిడ్ మానేరు ప్రధాన కాలువ, దాని అనుబంధ కాలువలను రెండు రోజులపాటు పరిశీలించిన అనంతరం ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. మిడ్ మానేరు కుడి కాలువలో కిలోమీటరు 37 నుండి 75 వరకు ఉన్న ప్రధాన కాలువలో జంగల్ కటింగ్ పనులు, సాధారణ నిర్వహణ పనులు చేపట్టాలని ముకుంద రెడ్డి సూచించారు. భారీ వర్షాల వల్ల ప్రధాన కాలువలోకి వరద నీరు రాకుండా అవసరమైన రక్షణ నిర్మాణాలు చేపట్టాలని ఆయన అన్నారు. అలాగే, ప్రధాన కాలువ, మైనర్ డిస్ట్రిబ్యూటరీ కాలువలకు (10L, 12L) సి.సి. లైనింగ్ చేయాలని డిమాండ్ చేశారు. కాలువల ఎత్తు తగ్గించి వాటిని సరిచేయాలని, పెండింగ్‌లో ఉన్న టెయిల్ ఎండ్ పనులను పూర్తి చేసి గుడిశాల-బొమ్మకల్ వరకు నీరు అందించాలని ఆయన కోరారు. దుద్దునపల్లి వద్ద ఉన్న 10L కాల్వ తూముకు నీరు సరిగా రావడానికి ప్రధాన కాలువపై గేట్లు నిర్మించాలని, ఎక్లాస్‌పూర్ గ్రామంలోని కేశవపట్నం రోడ్డు వద్ద ముగిసిన 10L కాల్వను దేవుడి చెరువు వరకు పొడిగించాలని అన్నారు. ఈ సమస్యలపై ఇరిగేషన్ అధికారులు, ప్రభుత్వం స్పందించకపోతే, సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని గీట్ల ముకుంద రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి గుండేటి వాసుదేవ్, సభ్యులు వి. శ్రీనివాస్, ఎం. రాజయ్య, ఎస్. శ్రీనివాస్, మల్లేశం, ఓదయ్య, రామరాజు, మదనయ్య తదితరులు పాల్గొన్నారు.
సాగునీటి కాలువల సమస్యలను పరిష్కరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES