Monday, August 25, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుఓయూ.. తెలంగాణకు ప్రత్యామ్నాయ ప‌దం: సీఎం రేవంత్ రెడ్డి

ఓయూ.. తెలంగాణకు ప్రత్యామ్నాయ ప‌దం: సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
 

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఉస్మానియా వర్సిటీ అనే పదం తెలంగాణకు ప్రత్యామ్నాయ పదమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిజాం నవాబును పొగుడుతూ పాడటం కాదు.. దేశ స్వాతంత్ర్యం కోసం ఓయూ గడ్డపై నిలబడి వందేమాతరం పాడిన పీవీ నరసింహా రావు (PV Narasimha Rao) నేడు తనకు గుర్తొస్తున్నారని తెలిపారు. తెలంగాణ సాధన యాదయ్య, శ్రీకాంతా చారి, వేణుగోపాల్ రెడ్డి కోసం అమరుడయ్యాడని గుర్తు చేశారు. అలాంటి చైతన్యాన్ని రగిల్చిన ఉస్మానియాను కొందరు కాలగర్భంలో కలిపాలని చూశారని ఆరోపించారు. 108 ఏళ్ల యూనివర్సిటీకి ఓ దళితుడిని వీసీగా చేసి చూపించామని అన్నారు.

తాను కూడా పేదరికం నుంచి ఈ స్థాయికి వచ్చానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విద్యార్థులు వారిని నష్టం చేసిన వాళ్లను నిర్ధ్వందంగా వ్యతిరేకించాలని పిలపునిచ్చారు. మన బడ్జెట్ రూ.లక్ష కోట్లు కాళేశ్వరం రూపంలో గంగలో కలిశాయని అన్నారు. కానీ, తమ ప్రభుత్వం రూ.25 వేల కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా యంగ్ ఇండియా స్కూళ్లను నిర్మిస్తోందని తెలిపారు. తాను మళ్లీ ఉస్మానియా యూనివర్సిటీ తప్పకుండా వస్తానని.. డిసెంబర్‌లో ఆర్డ్స్ కాలేజీ ముందు మీటింగ్ పెడతానని అన్నారు. క్యాంపస్ పరిధిలో ఒక్క పోలీస్ కూడా ఉండొద్దని.. ఎవరి అభిప్రాయం వాళ్లు చెప్పొచ్చని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యహరించిన ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీ పదవిపై ఢిల్లీ వరకు వెళ్లి కుట్రలు చేశారని.. మరో 15 రోజుల్లోగా ఎమ్మెల్సీగా కోదండరామ్‌ను పంపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఓయూకు రూ.వెయ్యి కోట్లు మంజూరు చేస్తానని.. ఇంజినీర్స్ కమిటీ వేయాలంటూ యోగితారాణాను సీఎం ఆదేశించారు.

ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) క్యాంపస్‌లో పలు అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. రూ.90 కోట్లతో నిర్మించిన హాస్టల్ భవనాలను సీఎం ప్రారంభించారు. అనంతరం డిజిటల్ లైబ్రరీతో పాటు రీడింగ్ రూమ్‌ను ఓపెన్ చేశారు. అదేవిధంగా దుందుభి, బీమా వసతి భవనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, ఓయూ వైస్ ఛాన్స్‌లర్ వీసీ కుమార్ పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad