Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలు100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లిందట 

100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లిందట 

- Advertisement -

– ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య 
పార్టీ ఫిరాయింపు పై  కేటీఆర్ కు కౌంటర్
నవతెలంగాణ-ఆలేరు
: పార్టీ ఫిరాయింపులపై కేటీఆర్ మాట్లాడడం 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు చేసినట్లు ఉందని ప్రభుత్వ బీర్ల ఐలయ్య అన్నారు. సోమవారం నాడు నవతెలంగాణతో మాట్లాడుతూ 10ఏండ్ల బిఆర్ఎస్ పాలనలో ప్రతిపక్షాలకు చెందిన 60 మంది ఎమ్మెల్యేలను భయపెట్టి డబ్బులు ఇచ్చి ఆశ పెట్టి నిర్లక్ష్యంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి చేర్చుకున్న చరిత్ర బిఆర్ఎస్ పార్టీకి ఉందన్న విషయం మర్చిపోయి సోయి తప్పి మాట్లాడుతున్నారని విమర్శించారు.

దొంగే దొంగ అని ఏడవడం కేటీఆర్ కె చెల్లింది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయమనే నైతిక హక్కు కోల్పోయారు అంటూ మీ పాలనలో చేరిన వారిని రాజీనామా ఎందుకు చేయించలేదో చెప్పాలన్నారు. ప్రజాస్వామ్యం ఆనాడు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. నీ దమ్మేంటో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పోటీపడి చూపించు అన్నారు ఉప ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ గెలుపు ఆపడం నీ తరం నీ యబ్బ తరం కాదన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కుటమి అభ్యర్థికి ఎందుకు మద్దతు ఇవ్వడం లేదన్నారు .తెలంగాణ సెంటిమెంట్ ఓట్లపుడే గుర్తొస్తుందా అని ప్రశ్నించారు. తెలంగాణ తెలుగు మాట్లాడే వ్యక్తిని ఉపరాష్ట్రపతిగా పోటీ పెట్టిన ఇండియా కుటమికి మోడీకి భయపడి మద్దతు ఇవ్వడం లేదన్నారు. వచ్చే ఎన్నికల నాటికి కేసీఆర్ కేటీఆర్ లకు సన్యాసం తప్పదు అన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad