Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పారిశుధ్ధ్య పనులు కొనసాగించాలి..

పారిశుధ్ధ్య పనులు కొనసాగించాలి..

- Advertisement -

సీజనల్ వ్యాధులు రాకుండా చూడాలి…
జిల్లా కలెక్టర్ హనుమంతరావు…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

గ్రామాలలో పారిశుద్ధ్య పనులు  నిరంతరం కొనసాగించాలని, సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం రోజు భువనగిరి మండలం బొల్లేపల్లి గ్రామంలో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకి గ్రామంలో ఎక్కడ కూడా చెత్త ,  గుంతల్లో నిలిచిన నీరు ఉంటే వెంటనే శుభ్రం చేయాలన్నారు. గ్రామం లో రోజు  ఫాగింగ్ చేస్తున్నారా, ఫాగింగ్ చేయాలన్నారు. వర్షపు నీరు నిలిచిన చోట దోమలు వ్యాప్తి చెందకుండా ఉండటానికి ఇప్పటికే సిద్ధంగా ఉన్న   ఆయిల్ బాల్స్ వేస్తున్నారా లేదా అని  పంచాయతీ సెక్రటరీ ని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా  ఉండేందుకు మెడికల్ క్యాంపు లు నిర్వహించారా, ఎవరికి అయినా డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు వచ్చినట్లయితే  వారిని వెంటనే జిల్లా ఆసుపత్రి లో చికిత్స నిమిత్తం  తరలించాలి అని చెప్పారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే ఫ్రైడే నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad