Monday, October 27, 2025
E-PAPER
Homeజాతీయంకేరళలో 'జలమాన్‌ జీవన్‌' ప్రచారం

కేరళలో ‘జలమాన్‌ జీవన్‌’ ప్రచారం

- Advertisement -

తిరువనంతపురం : కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ‘ జలమాన్‌ జీవన్‌ (వాటర్‌ ఈజ్‌ లైఫ్‌) ‘ ప్రచారాన్ని ప్రారంభించారు. నీటిద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం కోసం ‘హరిత కేరళమ్‌ మిషన్‌’ నేతృత్వంలో ఈ క్యాంపెయిన్‌ను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కార్యక్రమంలో భాగంగా ఆగస్ట్‌ 30, 31 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని బావులను క్లోరినేట్‌ చేయడం, ఇండ్లు, నీటి ట్యాంకులను శుభ్రం చేయడం వంటి చర్యలు చేపట్టనున్నట్టు పేర్కొంది. అలాగే పాఠశాలల్లో అవగాహన కార్యకలాపాలను చేపట్టాలని పేర్కొంది.నీటిద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడంలో ఇది ప్రభావంతంగా పనిచేస్తుందని పేర్కొంది. ఈకార్యక్రమంలో ఆరోగ్యశాఖ, స్థానిక స్వపరిపాలన శాఖ, విద్యాశాఖ, హరిత కేరళం మిషన్‌ పాల్గొననున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -