శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ వెంకటరమణ
నవతెలంగాణ – హిమాయత్ నగర్
మట్టి వినాయక విగ్రహాలపై విద్యార్థిని, విద్యార్థులకు అవగాహన కల్పించవలసిన అవసరం ఉందని శ్రీ చైతన్య స్కూల్ నల్లకుంట బ్రాంచ్ ప్రిన్సిపాల్ వెంకటరమణ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు సూచించారు. వినాయక చవితి పండుగ పురస్కరించుకుని మంగళవారం శ్రీ చైతన్య స్కూల్ నల్లకుంట బ్రాంచీలో విద్యార్థుల చేత వినాయకుడి చిత్రపటాల డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించారు. ఈ కాంపిటీషన్ లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. మట్టితో చేసిన వినాయక విగ్రహాలను పూజించాలని, రసాయనాలతో చేసిన విగ్రహాలు అందంగా కనిపించిన పూజల అనంతరం వాటిని చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేయడం వల్ల నీరంతా కలుషితమై నీటి రంగు మారి, తాగడానికి పనికిరావన్నారు. పూజలు అందుకున్న మట్టి వినాయక విగ్రహాలను మన ఇండ్లల్లో నిమజ్జనం చేసి ఆ నీటిని మొక్కల కుండీలలో పోయాలని, తద్వారా పర్యావరణాన్ని కాపాడుకున్న వారమవుతామని ఆయన పేర్కొన్నారు. ఇటు వంటి విషయాలు పిల్లలకు తెలియజేసి, అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు సూచించారు.ఈ కార్యక్రమంలో స్కూల్ ఇంచార్జిలు శాంతి, ఇందిరా, మురళీ, రవి, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మట్టి వినాయక విగ్రహాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES