Thursday, August 28, 2025
E-PAPER
spot_img
Homeకరీంనగర్సహాయ చర్యలకు హెలికాప్టర్ కావాలని కోరిన ప్రభుత్వ విప్ ఆది

సహాయ చర్యలకు హెలికాప్టర్ కావాలని కోరిన ప్రభుత్వ విప్ ఆది

- Advertisement -

హెలికాప్టర్ ద్వారా సహాయం కోసం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నంతో మాట్లాడిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల

వరద ప్రవాహంలో చిక్కుకున్న పశువుల కాపరులను కాపాడటం కష్టంగా మారడంతో హెలికాప్టర్ ద్వారా వారిని సురక్షితంగా ఇవతలి గడ్డకు తరలించడంపై అధికారులు దృష్టి పెట్టారు. ఘటన స్థలానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్, జిల్లా ఎస్పీ మహేష్ బి గితే ఆపదలో చిక్కుకున్న, గల్లంతైన రైతుల కుటుంబాలతో మాట్లాడారు. ఆపదలో చిక్కుకున్న పశువుల కాపరులతో ఫోన్ ద్వారా మాట్లాడి ధైర్యం చెప్పారు. సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో అధికారులు మాట్లాడి పరిస్థితిని వివరించారు.

సమాచారం అందుకున్న ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ ఆపదలో చిక్కుకున్న రైతులతో మాట్లాడి, మంత్రులు పొన్నం ప్రభాకర్ తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో వారిని మాట్లాడించారు. వాతావరణం అనుకూలించిన వెంటనే సహాయ చర్యల కోసం హెలికాప్టర్ను పంపించనున్నట్లు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆపదలో ఉన్న రైతులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. తను ఆపదలో చిక్కుకున్న వారిని క్షేమంగా ఇంటికి చేర్చే బాధ్యత ప్రభుత్వానిదేనని భరోసా ఇచ్చారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad