సైబర్ క్రైమ్ పట్ల అప్రమత్తంగా ఉండాలి
జిల్లా ఎస్పీ డివి శ్రీనివాస రావు
నవతెలంగాణ – నర్సాపూర్
మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని మెదక్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాస్ రావు అన్నారు. నర్సాపూర్ పట్టణంలోని బి వి ఆర్ ఐ టి ఇంజనీరింగ్ కళాశాలలో డ్రగ్స్ పై, సైబర్ క్రైమ్ ఫై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఎస్పి డివి శ్రీనివాస రావు మాట్లాడుతూ మత్తు పదార్థాలకు అలవాటు పడి విద్యార్థులు తమ విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. మత్తు పదార్థాలు అమ్ముతున్నారని తెలిస్తే అట్టి వ్యక్తులపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు.
తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకోని తమను చదివిస్తున్నారని వారి ఆశలను నెరవేర్చాలని అన్నారు. సైబర్ క్రైమ్ పట్ల విద్యార్థులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు ఎవరైనా ఫోన్ ద్వారా లేనిపోని మెసేజ్ లు పంపితే వాటిని నమ్మవద్దని సూచించారు .సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులతో కలిసి మెలసి ఉండాలని ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ మహేందర్, సైబర్ క్రైమ్ డీఎస్పీ శ్రీ సుభాష్ చంద్రబోస్, తూప్రాన్ డిఎస్పి నరేందర్ గౌడ్, సీఐ జాన్ రెడ్డి, ఎస్సై లింగం , కళాశాల యాజమాన్యం మేనేజర్ బాపిరాజు, ఏవో సురేష్ విద్యార్థులు ఉన్నారు.
ముత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES