Wednesday, August 27, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్మండలంలో ఎడతెరిపి లేని వర్షాలు 

మండలంలో ఎడతెరిపి లేని వర్షాలు 

- Advertisement -

పలు చెరువులకు కుంటలకు గండ్లు 
రోడ్లు తెగీపోవడంతో ఇబ్బందులు పడుతున్న జనాలు 
నవతెలంగాణ – నిజాంపేట 

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో మండలంలోబుధవారం రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున జనాలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. చెరువులు కుంటలు నిండడంతో ఒకపక్క రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్న సందర్భంలో ఒకపక్క జనజీవనం అస్తవ్యస్తంగా అయిందని చెప్పొచ్చు. నార్లాపూర్ లో కుంటలు తెగిపోవడంతో కల్వకుంట నుండి నార్లాపూర్ రాకపోకలు బందు అయినాయి. బచ్చు రాజు పల్లి నుండి దొంగల ధర్మారం రోడ్డు తెగిపోవడంతో రాకపోకలు బంద్ జరిగినాయి.  చెరువులు కుంటలు తెగిపోవడంతో మండల ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు.

చల్మెడ  సోమయ్య చెరువు తెగిపోయి ఉధృతంగా ప్రవహిస్తూ నిజాంపేట మల్కచెరులోకి వెళుతున్నందున ఆ చెరువు కూడా ప్రమాదంలోనే ఉన్నది, చల్మెడ_  నిజాంపేట గ్రామాలకు రాకపోకలు బంద్ , నస్కల్ _ నిజాంపేట గ్రామాలకు  రాకపోకలు బంద్, మండల కేంద్రంలో కొందరి ఇళ్లలోకి నీరు చేరడంతో అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఇండ్లలోకి పాములు రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. రోడ్డు రవాణా సరిగా లేక వర్షానికి రోడ్లు తెగిపోవడం జరిగింది ప్రయాణం చేయాలంటే నరకాయాతన అనుభవిస్తున్నారు. ప్రభుత్వము అధికారులు  స్పందించి వెంటనే రోడ్ల మరమ్మతులు డ్రైనేజీ వ్యవస్థను చక్కదిద్యాలనీ  తగు చర్యలు చేపట్టాలని మండల ప్రజలు వేడుకుంటున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad