Thursday, August 28, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్వర్షములోనే పలు కాలనీల్లో పర్యటించిన మాజీ కౌన్సిలర్

వర్షములోనే పలు కాలనీల్లో పర్యటించిన మాజీ కౌన్సిలర్

- Advertisement -

నవతెలంగాణ ఆర్మూర్

పట్టణంలోని సంతోష్ నగర్ లో గల లోతట్టు ప్రాంతం సంతోష్ నగర్ , సిక్కుల కాలనీలలో అత్యంత పేద వారు ప్రభుత్వ స్థలములో చిన్న చిన్న గుడిసెలు రేకుల షెడ్లు వేసుకుని జీవిస్తున్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఇండ్లలో వర్షపు నీరు వచ్చి బియ్యం , ఇతర వస్తువులు తడిసి వారికి నష్టం జరిగింది, భారీ వర్షముతో సంతోష్ నగర్ లో కొన్ని ఇండ్లు గోడలు కూలి పూర్తిగా డామేజ్ అయినాయి.

అందులో నివసిస్తున్న వారికీ తృటిలో ప్రాణాపాయం తప్పింది. సమస్యలను తెలుసుకున్న మున్సిపల్ మాజీ కౌన్సిలర్, న్యాయవాది సంగీతా ఖాందేష్, పట్టణ కాంగ్రెస్ నాయకులు ఖాందేష్ సత్యం తో కలిసి వర్షములోనే లోతట్టు ప్రాంతమైన సిక్కుల కాలనీ, సంతోష్ నగర్ కు వెళ్లి గోడ కూలిన ఇండ్లను చూసి, లోతట్టు ప్రాంత సమస్యలను పరిశీలించి చలించి వెంటనే మున్సిపల్ కమిషనర్ కు, సానిటరీ అధికారులకు సమస్యల గురించి వివరించగా వార్డు ప్రత్యేక అధికారి చక్రధర్ అక్కడకి వచ్చి గోడ కూలిన ఇండ్లను, లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు.

మున్సిపల్ సిబ్బంది ద్వారా నిలువ వున్న నీళ్లు తొలగించాలని కోరగా మున్సిపల్ సిబ్బంది వచ్చి తాత్కాలికంగా పరిష్కరించారు. మాజీ కౌన్సిలర్ సంగీతా ఖాందేష్ మున్సిపల్ కమిషనర్ తో చరవాణి లో మాట్లాడగా కాలనీలలో నిలిచి వున్న మడుగు నీళ్లు పోయేలా జేసీబీ తో కచ్చా డ్రయిన్ చేయిస్తామని, గోడ కూలి నష్టపోయిన బాధితులకు న్యాయం చేస్తామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. మున్సిపల్ సిబ్బంది శంకర్, పోషన్న కాలనీ పెద్దలు గండికోట రాజు, సంతోష్, నరేష్, సాయినాథ్, మేతాబ్ సింగ్, హర్భజన్ సింగ్ , కాలనీ వాసులు తదితరులు వున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad