నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్
యాదాద్రి జిల్లా జిల్లా కేంద్రంగా 102 అమ్మఒడి వాహనాలు నిరంతరంగా అద్భుతమైన సేవలను అందిస్తున్నాయి. గర్భిణీ స్త్రీలను ప్రతినెల జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ప్రాథమిక కేంద్రానికి సరైన సమయానికి యాంటీనేటల్ చెక్ అప్ కి తీసుకువెళ్లి.. జాగ్రత్తగా ఇంటికి చేర్చడంలో కీలక పాత్ర వహిస్తున్నాయి. కాన్పు అనంతరం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయి వెళ్లేటప్పుడు తల్లిని బిడ్డను ఇద్దరిని క్షేమంగా చేర్చడంలో ముందు వరుసలో ఉంటున్నాయి గర్భిణీ స్త్రీల యొక్క అవసరాలను తీర్చడంలో 102 అమ్మఒడి వాహనాలు ముందుంటాయి.
ప్రతి సబ్ సెంటర్ కు సంబంధించి గర్భిణీ స్త్రీల యొక్క వివరాలను 102 వాహనాల సిబ్బందికి తెలియజేస్తారు. సరైన సమయంలో వారిని ఆసుపత్రికి తీసుకువచ్చి చికిత్స అందేలా చూస్తూ ప్రతి నెల నెల పరీక్షలు మందులు అందించడం లో ఆసుపత్రికి తీసుకురావడం ద్వారా అక్కడ వైద్య అధికారులు సరైన సమయానికి ప్రతి నెల నెల గర్భిణీకి పరీక్షలు చేయడం వలన సరైన సమయానికి సలహాలు, సూచనలు అందజేస్తున్నారు. ఇంత అద్భుతంగా గర్భిణీ స్త్రీలను తరలించడంలో 102 వాహనాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. జిల్లా కేంద్రంలో భువనగిరి, ఆలేరు ,చౌటుప్పల్ ,రామన్నపేట, తుర్కపల్లి ,మోత్కూరు ఆరు వాహనాలు సేవలు అందిస్తున్నాయి గత ఆరు నెలలుగా చూసుకుంటే ప్రతి నెల చెకప్ లు మరియు కాన్పు తర్వాత ఇంటికి తరలించడంలో 102 వాహనాలుసేవలు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.
102 వాహనాలు అందించిన సేవలు…
మార్చి నెల -652, ఏప్రిల్ మాసం-590, మే నెల -630, జూన్ నెల -550, జూలై -600, ఆగస్టు నెల -570, గర్భిణీ స్త్రీలకు అందించిన సేవలు వివరాలు ఇలా ఉన్నాయి. ప్రతి ఒక్కరు గ్రామాల నుంచి హాస్పిటల్ కి వెళ్లేటప్పుడు చెక్ అప్ కు వెళ్లడానికి 102 అమ్మఒడి వాహనాల సేవలను తప్పనిసరిగా వినియోగించుకుంటే దీనివలన సరైన సమయంలో గర్భిణీగా ఉన్నప్పుడు చికిత్స అందడం వలన తల్లి బిడ్డలు క్షేమంగా ఉంటారు కావున ప్రతి ఒక్క గ్రామంలో ప్రజలు 102 వాహనాల సేవలను తప్పనిసరిగా వినియోగించుకోవాలి.
యాదాద్రి జిల్లాప్రోగ్రాం మేనేజర్ షేక్ సలీం…
గర్భిణీ స్త్రీల ఆరోగ్య సమస్యలు రాకుండా తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా కాన్పు కావడంలో 102 వాహనాల పాత్ర అనేది కీలకంగా పోషిస్తుంది మా ముందున్న లక్ష్యం గర్భిణీ స్త్రీలకు సరైన సమయంలో మెరుగైన చికిత్స అందించడమే మా ముందున్న ధ్యేయం అన్నారు.
యాదాద్రి జిల్లా 102 అధికారి, కోఆర్డినేటర్ ఇంచార్జ్ మహేష్ కుమార్…
గర్భిణీ స్త్రీలకు సరైన సమయానికి నాణ్యమైన వైద్యం అందించడంలో 102 వాహనాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, మునుముందు కూడా ఇలాగే అమ్మఒడి వాహనాల సేవలను నిరంతరం అందించడంలో ముందు ఉంటాయని తెలిపారు.