నవతెలంగాణ – తిమ్మాజిపేట
మండలంలో యురియా ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. ఇన్ని రోజులు సమస్య పెద్దగా కనపడకున్న, తాజాగా అది ప్రారంభమయ్యింది. గతకోన్ని రోజులకు యురియా లేకపోవడం వర్షాలు బాగా కురవడంతో ఇబ్బందులు తలెత్తాయి. గురువారం మండలంలో రెండు ఆగ్రో సేవా కేంద్రాలలో యురియా కోసం రైతులు బారులు తీరారు. ఆధార్ కు కేవలం రెండు బస్తాలు మాత్రమే ఇస్తుండటంతో సమస్య మరింత జటిలంగా మారింది. యురియా కోసం ఉదయం నుంచే మండలంలోని వివిద గ్రామాల రైతులు ఆగ్రో సెంటర్ల ముందు బారులు తీరారు. మొదట టోకెన్లు ఇచ్చినా, రైతుల సంఖ్య పెరగడంతో గందరగోళం ఏర్పిండింది. రైతుల మధ్య తోపులాటలు జరగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి అదుపలోకి తీసుకవచ్చారు. ఉదయం నుంచి సాయింత్రం దాక దుకాణాల వద్ద రైతులు లైన్లు కోనసాగాయి. మండలంలో 50 టన్నుల యురియా నిల్వలుఉన్నాయని, రైతులు ఆందోళన చెందవద్దని మండల వ్యవసాయ అధికారి కమలకుమార్ విజ్ఞప్తి చేశారు.
యురియా కోసం తిమ్మాజిపేటలో రైతుల ఇబ్బందులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES