నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండల కేంద్రంతో పటు మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో చెరువులు వాగులు కుంటలు నిండి పొంగి పొర్లడంతో ఎక్కడికక్కడ రాకపోకలు బంద్ అయిపోయాయి. సర్వపూర్ వాగు పొంగి పొర్లాడుతూ బాన్సువాడ గాంధారి రాకపోకలు మండలంలోని బూర్గుల్ వాగు బ్రిడ్జి పైనుంచి పాడడంతో అధికారులు సందర్శించి రాకపోకలు నిలిపివేశారు. అలాగే మండలంలోని గుజ్జుల వద్ద భారీ వర్షాలకు బ్రిడ్జి ప్రమాద స్థితికి చేరింది. భారీ వర్షాలకు కర్ణం గడ్డకు వెళ్లే బ్రిడ్జి పూర్తిగా కొట్టుకుపోయింది. ఇక గాంధారి మండల కేంద్రంలో రెండు రోజుల కురుస్తున్న భారీ వర్షాలకు పెద్దవాగు భయంకరంగా ప్రవహిస్తుంది. పెద్ద వాగు ఉదృతికి మండల కేంద్రంలోని వాగుకు ఇరు ప్రాంతాల్లో ఉన్న పెద్ద చెరువు కింద ఉన్న కాలనీ నీట మునిగింది అలాగే దుర్గా నగర్ లోని కొన్ని ఇండ్లు నీట మునిగాయి.
అలాగే ఎస్సీ కాలనీలోని కొన్ని ఇండ్లు లోకి నీరు చేరడంతో వారిని మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పునరవస కేంద్రాన్ని తరలించారు. గురువారం ఉదయం నుండి తాసిల్దార్ రేణుక చౌహన్. ఎంపీడీవో రాజేశ్వర్ , ఎస్సై ఆంజనేయులు మండల కేంద్రంలోని వివిధ ప్రాంతాలను పరిశీలించి వరద వచ్చే ప్రభావం ఉన్న ప్రాంతాలలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద ప్రాంతాల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల లక్ష్మణ్, సొసైటీ చైర్మన్ సాయికుమార్, మాజీ జడ్పిటిసి సభ్యులు తానాజీ రావు, గాంధారి మాజీ సర్పంచ్ మమ్మాయి సంజీవ్ యాదవ్, మాజీ ఎంపీటీసీలు తూర్పు రాజులు, కామిల్లి బాలరాజ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాజీ సర్పంచ్ సత్యం, ఏఎంసి డైరెక్టర్ బొమ్మని బాలయ్య, మాజీ కోఆప్షన్ నెంబర్ ముస్తఫా తదితరులు వివిధ ప్రాంతాలను సందర్శించి బాధితులను సురక్షిత ప్రాంతాలకు పునరావాస కేంద్రాలకు తరలించారు. ఈ సందర్భంగా గాంధారి గ్రామస్తులు మాట్లాడుతూ.. గత 40 సంవత్సరాలుగా ఇంతటి వరద ఎప్పుడు చూడలేదని వరదలతో గాంధారికి చాలా నష్టం వాటిలిందని వాపోయారు.