బడే నాగజ్యోతి బి ఆర్ ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్
పంట నష్టపోయిన రైతుకు ఎకరాకు రూ.50,000 వేలు పరిహారం ఇవ్వాలి
నవతెలంగాణ – గోవిందరావుపేట
భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని బిఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇంచార్జి బడే నాగజ్యోతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం తాడ్వాయి మండలంలోని ఊరట్టం, కన్నెపల్లి, నార్లపూర్, గ్రామాలలోని నష్టపోయిన రైతులతో కలిసి ఆమె పంట పొలాలను సందర్శించారు.ఈ సందర్భంగా బడే నాగజ్యోతి మాట్లాడుతూ.. మేడారం ఊరట్టం, కన్నెపల్లి, నార్లాపూర్, గ్రామాలలో వందలాది ఎకరాల పంట నష్టం జరిగిందని అలాగే దాదాపు వందల ఎకరాల వ్యవసాయ భూములలో ఇసుక మేటలు ఏర్పడ్డాయని అన్నారు.
రెవెన్యూ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతుకు ఎకరాకు 50 వేల రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని ఆమె కోరారు. అదేవిధంగా భారీ వర్షంతో పంట పొలాలలో ఇసుకమేటలు ద్వారా రైతులు నష్టపోతున్నారని వాటిని ప్రభుత్వమే తొలగించాలని ఆమె కోరారు. తూముల వాగుకు మరియు జంపన్న వాగుకు ఇరువైపులా చిలుకల గుట్ట వరకు కరకట్ట నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆమె కోరారు.
ఈ కార్యక్రమంలో తాడ్వాయి మాజీ జెడ్పిటిసి గ్రామ సహాయం శ్రీనివాసరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పోగు నాగేష్, మాజీ సర్పంచులు చిడం బాబురావు, గొంది శ్రీధర్, సిద్ధబోయిన చిన్నక్క, శివరాజ్, ఎటునాగారం మాజీ సర్పంచ్ ఈసం రామ్మూర్తి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు జాడి బాబురావు, మాజీ ఎంపిటిసి సోలం వెంకన్న, గజ్జల్ల రాంబాబు, చిర్ర సంజీవరెడ్డి, నల్లముక్క లక్ష్మీ సమ్మయ్య, గొంది లోకమూర్తి, గోపాల్ పురం సతీష్, సంకె ప్రణయ్, కోరం సమ్మక్క, మాదరి కేశవరావు, రాజిరెడ్డి, బెండల నరసయ్య, కేశవరావు నీలం రాములు, సాగర్, రోహిత్, కిషోర్, ఇరుప చంద్రశేఖర్, యూత్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.