- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీలో మరో దారుణం జరిగింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మండివాలీ అనే ప్రాంతంలో శుక్రవారం ఓ ఇల్లు కూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను ఆస్పత్రికి తరలించారు. ముగ్గురింట్లో ఒకరు పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, మిగిలిన ఇద్దరికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు.
- Advertisement -