- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
పట్టణ కేంద్రంలోని పాత హరిజనవాడలో రెండు రోజులుగా కురిసిన వర్షానికి ఉరుస్తున్న పెంకుటిళ్లను కౌసల్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు జ్ఞాన ప్రకాశ్ రెడ్డి పరిశీలించారు. అనంతరం కౌసల్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆశీస్సులతో రైన్ ప్రూఫ్ టాపర్లను కాలనీలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వేణు, నాయకులు మహేందర్ రెడ్డి, రామచంద్రం, మల్లేశం, ప్రభాకర్, బాబు, రవి, కాలనీ వాసులు, తదితరులు, ఉన్నారు.
- Advertisement -