Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలువరద బాధితులను ఆదుకుంటున్నాం: ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి

వరద బాధితులను ఆదుకుంటున్నాం: ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ మోపాల్:

నిజామాబాద్ రూరల్ లోని శుక్రవారం రోజున రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి క్యాంపు కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలేశ్వరం ప్రాజెక్టు అతిపెద్ద స్కాం అని, గత కెసిఆర్ ప్రభుత్వం సుమారు లక్ష కోట్ల ఖర్చుపెట్టిన ప్రాజెక్టు నిర్వేర్యం అయిందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. అలాగే ఆయన మాట్లాడుతూ కాలేశ్వరం ప్రాజెక్టు వంద ఏళ్లు ఉండాల్సినది. మూడేళ్లకే కూలిందని, గత ప్రభుత్వం తప్పు చేయలేదని బిఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్, హరీష్ రావులు అంటున్నారని అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై కమిటీ ఇచ్చిన నివేదిక అసెంబ్లీలో పెట్టుతున్నామని, కేసిఆర్ హరీష్ రావులు దోషులుగా తేలారని, రేపు జరగబోయే అసెంబ్లీలో వారిద్దరిని దోషులుగా నిలబెట్టబోతున్నామని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి తెలిపారు.

కేసిఆర్ ముందు నుంచి ఘోష్ కమిటీని వ్యతిరేకిస్తూ, కమిటీ నివేదిక వచ్చిన తర్వాత కోర్టుని ఆశ్రయించి, నివేదిక నిలిపివేయాలని కోర్టులో పిటిషన్ వేశారని, ఇదంతా చూస్తే బీఆర్ఎస్ గత ప్రభుత్వం కెసిఆర్ తప్పు చేసినట్టు అర్థం అవుతుందని అన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో బిల్లు పెట్టామని, చట్టం చేసి గవర్నర్ పంపితే గవర్నర్ సంతకం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించగా కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ ఇవ్వడానికి వెనకడుగు వేస్తుందని అన్నారు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ కు మద్దతు ఇచ్చి, పార్లమెంటులో మద్దతు ఇవ్వకపోవడం టిఆర్ఎస్ బిజెపి లకు రిజర్వేషన్ల విషయంలో చిత్తశుద్ధి లేదని అన్నారు.

కొత్తగా రిజర్వేషన్లలలో ఎవరికి ప్రవేశం ఇవ్వలేదని, బిజెపి పాలిత ప్రాంత రాష్ట్రాలలో ముస్లింలు బీసీల్లో ఉన్నారని, ఈ వంకతో రిజర్వేషన్లు అడ్డుకుంటున్న బిజెపి వారు పాలించే రాష్ట్రాల్లో ముస్లింలను తొలగించి చూపాలని అన్నారు. టిఆర్ఎస్ బిజెపి పార్టీలు బిసీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని అన్నారు. అలాగే గురువారం రోజున నిజాంబాద్ రూరల్ నియోజవర్గంలో కొన్ని గ్రామాలను ముంచేత్తిందని, వాడి, కొండూర్, బీరప్ప తండా,నడిమి తండా, లక్ష్మీ చెరువు తండా, చిన్న వాల్గోట్ పెద్ద వాల్గోట్ గ్రామాలలోకి భారీ ఎత్తున నీళ్లు వచ్చాయని, వందేళ్లలో లేనంత వరద వచ్చిందని అక్కడ ప్రజలు తెలిపారని అన్నారు. ఇక్కడ ఎలాంటి ప్రాణా నష్టం జరగలేదని, ఆస్తి నష్టం జరిగిందని, వరదలపై ఎప్పటికప్పుడు స్పందించి అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

కొంతమందిని పునర్ నివాసం కోసం ఓనాజిపేట్ గ్రామంలోని హైస్కూల్లో ఏర్పాటు చేశామని వారికి ఎప్పటికప్పుడు వైద్య కోసం క్యాంపు ఏర్పాటు చేశామని అన్నారు. ఆహారం, నీళ్లు వసతి కల్పించామని అన్నారు. అలాగే డిష్పల్లి మండలం బర్దిపూర్ ధర్మారం వాగు పక్కన నివసిస్తున్న ప్రజలకు వరద ముంచేసిందని , వారిని ధర్మారం హైస్కూల్లోకి తరలించామని అన్నారు, వారికి ఆహారం, నీళ్లు బట్టలు వైద్య సదుపాయాలు కల్పించామని అన్నారు. అలాగే బోర్గం బ్రిడ్జికి అనుకొని ఉన్న వాగులు ప్రక్కన ఉన్న పాంగ్ర ప్రజలను ఒక ఫంక్షన్ హాల్ లో నివాసం ఏర్పాటు చేశామని అన్నారు. వీరికి ఆహార సదుపాయాలు కల్పించామని, నిత్యవసరాలు, వైద్య సదుపాయం కల్పించామని అన్నారు.

కొంతమంది ఇల్లు ఫాక్షికంగా దెబ్బ తిన్నాయని అన్నారు. త్వరలో అధికారులు విచారణ చేపట్టి నివేదిక ఇచ్చిన తర్వాత వారికి అన్ని విధాలు ఆదుకుంటామని అన్నారు. గత రెండు రోజుల్లోగా కురిసిన వర్షం వల్ల జరిగే నష్టం విషయంపై నివేదికలు తెప్పించుకుంటున్నామని, వారిని ప్రజా ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఐసిడిఎంఎస్ చైర్మన్ మునిపల్లి సాయి రెడ్డి, డిచ్పల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొలసాని శ్రీనివాస్, డిచ్పల్లి సొసైటీ చైర్మన్ రామచందర్ గౌడ్, ఏఎంసి డైరెక్టర్ బాగా రెడ్డి,నరేందర్, రాజలింగం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad